Rythu Bandhu 2021: నేటి వరకు 58.07 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.6632.74 కోట్ల యాసంగి రైతుబంధు నిధులు జమ

|

Jan 07, 2021 | 1:51 PM

ఈ రోజు వరకు 58.07 లక్షల రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమ చేసినట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Rythu Bandhu 2021: నేటి వరకు 58.07 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.6632.74 కోట్ల యాసంగి రైతుబంధు నిధులు జమ
Follow us on
Rythu Bandhu Status 2021:  ఈ రోజు వరకు 58.07 లక్షల రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమ చేసినట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  132.65 లక్షల ఎకరాలకు గాను రూ.6632.74 కోట్లు జమ చేసినట్లు వివరించారు.  పదెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి నేరుగా నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.  అత్యధికంగా నల్గొండలో 4,31,660 మంది రైతుల ఖాతాలలోకి రూ.530.07 కోట్లు జమ చేసినట్లు వివరించారు.  కనిష్టంగా మేడ్చల్ జిల్లాలో 29,685 మంది రైతుల ఖాతాలలోకి రూ.26.82 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
నల్గొండ తరువాత స్థానాలలో అత్యధిక లబ్దిదారులు ఉన్న ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. లక్ష లోపు లబ్దిదారులు మేడ్చల్, ములుగు, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రైతులు తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో నల్లగొండ తర్వాత ఎక్కువ నిధులు నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లాయని.. అక్కడి 2,52,958 మంది రైతుల ఖాతాలలో రూ.327.13 కోట్లు జమ చేసినట్లు వివరించారు. అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు.  అందుకే కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం అందజేసినట్లు తెలిపారు.  మరో మూడు, నాలుగు రోజులలో మిగిలిన రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామన్నారు.  రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Also Read :

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్