చలాన్లు కట్టని మంత్రులు.. ట్రాఫిక్ పోలీసుల ఇక్కట్లు..

| Edited By: Srinu

Jul 01, 2019 | 8:01 PM

బ్రతకడానికే కష్టమైన ఈ రోజల్లో ట్రాఫిక్ చలాన్లు ప్రజలకు మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. అదీగాక.. ట్రాఫిక్ చలాన్లు మళ్లీ పెంచుతున్నట్లు మరోసారి ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొంది. అలాగే 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు తెలంగాణ మంత్రులపై కూడా భారీగానే చలాన్లు నమోదయినట్లు తెలుస్తోంది. వారిలో.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దంపతుల వాహనాలపై 55 చలాన్లు, […]

చలాన్లు కట్టని మంత్రులు.. ట్రాఫిక్ పోలీసుల ఇక్కట్లు..
Follow us on

బ్రతకడానికే కష్టమైన ఈ రోజల్లో ట్రాఫిక్ చలాన్లు ప్రజలకు మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. అదీగాక.. ట్రాఫిక్ చలాన్లు మళ్లీ పెంచుతున్నట్లు మరోసారి ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొంది. అలాగే 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు తెలంగాణ మంత్రులపై కూడా భారీగానే చలాన్లు నమోదయినట్లు తెలుస్తోంది. వారిలో.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దంపతుల వాహనాలపై 55 చలాన్లు, మంత్రి మల్లారెడ్డి వాహనంపై 8 చలాన్లు, అలాగే.. మరో మంత్రి పేరుపై రూ.46 వేలు, వారి భార్య పేరుపై రూ.16,390లు చలాన్లు నమోదయ్యాయి. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి.