స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి

|

Dec 24, 2020 | 8:35 PM

కేంద్రమంతి స్మృతి ఇరానీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో..

స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి
Follow us on

కేంద్రమంతి స్మృతి ఇరానీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. రానున్న బడ్జెట్లోనూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల పవర్‌లూమ్‌ క్లస్టర్, తెలంగాణ చేనేత పరిశ్రమకి సరైన సహకారం అందించాలని కోరారు. చేనేత ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని  మంత్రి స్మృతి ఇరానీని కోరారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్‌ గణన చేపట్టి జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై  పలు సూచనలు చేశారు కేటీఆర్. తెలంగాణలో టెక్స్టైల్, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయం ఆశిస్తున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను రూ.993.65 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం రూ.49.84 కోట్లు మంజూరు చేయాలన్నారు. రూ.756 కోట్లతో పవర్‌లూమ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్రానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.