ఎగ్జామ్ పేపర్ల వాల్యుయేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు…

|

Apr 17, 2020 | 11:50 AM

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ వ‌ల్ల‌ ఇంటర్ ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతంద‌న్న విష‌యంపై సందిగ్ద‌త నెల‌కున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఫ‌స్ట్ ఫేజ్ లాక్‌డౌన్ కంప్లీట్ అయ్యాక వాల్యుయేషన్ చేపడతారని వార్తలు వచ్చినా.. అలాంటిదేమీ లేదని, మే 3 వరకు మూల్యాంకనం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. అదే నెల 15వ తేదీ నుంచే […]

ఎగ్జామ్ పేపర్ల వాల్యుయేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు...
Follow us on

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ వ‌ల్ల‌ ఇంటర్ ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతంద‌న్న విష‌యంపై సందిగ్ద‌త నెల‌కున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఫ‌స్ట్ ఫేజ్ లాక్‌డౌన్ కంప్లీట్ అయ్యాక వాల్యుయేషన్ చేపడతారని వార్తలు వచ్చినా.. అలాంటిదేమీ లేదని, మే 3 వరకు మూల్యాంకనం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. అదే నెల 15వ తేదీ నుంచే లాంగ్వేజెస్‌ సబ్జెక్టులు, 19 నుంచి అప్షనల్‌ సబ్జెక్టుల వాల్యువేష‌న్ ప్రారంభమైంది. అయితే కరోనావైరస్ విజృంభన ప్రారంభ‌మ‌వ్వ‌డం..కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించడంతో.. మూల్యాంకనాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొద‌ట ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ ముగిసినా..మ‌హమ్మారి వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో ప్ర‌ధాని అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చించిన అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగిస్తు్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో మే 3 తర్వాతే వాల్యుయేషన్ చేపడతామని బోర్డు తెలిపింది.