Telangana Intermediate Board: పరీక్షల విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న ఇంటర్‌ బోర్డు

|

Jan 07, 2021 | 5:13 AM

Telangana Intermediate Board: కరోనా పరిస్థితుల కారణంగా పరీక్ష విధానంలో మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియేట్‌ బోర్డు ప్రయత్నాలు కొనసాగిస్తోంది...

Telangana Intermediate Board: పరీక్షల విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న ఇంటర్‌ బోర్డు
Follow us on

Telangana Intermediate Board: కరోనా పరిస్థితుల కారణంగా పరీక్ష విధానంలో మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియేట్‌ బోర్డు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో అతిస్వల్ప, స్వల్ప ధీర్ఘసమాధానాల కేటగిరీల్లో ఛాయిస్‌లను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అతిస్వల్ప సమాధానాల ప్రశ్నల్లో ఛాయిస్‌ ఇవ్వడం లేదు. అయితే రానున్న పరీక్షల్లో ఈ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది బోర్డు. ఏయే కేటగిరీల్లో ఎన్ని ప్రశ్నలు ఛాయిస్‌ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు అధికారులు.

మొదటి, రెండో సంవత్సరంలో 30 శాతం సిలబస్‌ను ఇప్పటికే తొలగించారు. సీబీఎస్‌ఈ పరీక్షల కంటే ముందు ఇంటర్మీడియేట్‌ పరీక్షలను నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ఏప్రిల్‌ నెలాఖరులో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. పరీక్షల ఫీజుల తేదీలను, రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది.

Kakatiya University Exam: జనవరి 20 నుంచి కాకతీయ యూనివర్సిటీ దూర విద్య పీజీ పరీక్షలు.. టైమ్ టేబుల్