ఒక్క క్లిక్ తో బిల్డింగ్ పర్మిషన్.. జూన్ 2 నుంచి టీఎస్-బీపాస్ అమలు

|

May 28, 2020 | 2:31 PM

తెలంగాణ ప్రభుత్వ పురపాలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పురపాలకల్లో పౌర సేవలను త్వరితగతిన పూర్తి అయ్యేలా ఆన్ లైన్ సిస్టమ్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్లు, గ్రేటర్​ హైదరాబాద్​లో భవన నిర్మాణాలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్‌– బీపాస్‌ విధానాన్ని జూన్​2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మున్సిపల్​శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ […]

ఒక్క క్లిక్ తో బిల్డింగ్ పర్మిషన్..  జూన్ 2 నుంచి టీఎస్-బీపాస్ అమలు
Follow us on

తెలంగాణ ప్రభుత్వ పురపాలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పురపాలకల్లో పౌర సేవలను త్వరితగతిన పూర్తి అయ్యేలా ఆన్ లైన్ సిస్టమ్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్లు, గ్రేటర్​ హైదరాబాద్​లో భవన నిర్మాణాలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్‌– బీపాస్‌ విధానాన్ని జూన్​2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మున్సిపల్​శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లోనే బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేలా . మీ సేవ సెంటర్లు, పౌర సేవ కేంద్రాలతో పాటు సొంతంగా కంప్యూటర్, మొబైల్ యాప్ ద్వారానూ అప్లై చేసుకోవచ్చు. దీనికోసం టీఎస్​‌‌– బీపాస్​పేరుతో ప్రత్యేకంగా వెబ్ ​పోర్టల్​ రూపొందించారు. అప్లికేషన్ లో ఏవైనా ఇబ్బందులుంటే అధికారులతో మాట్లాడేందుకు 040–22666666 టోల్​ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేశారు. టీఎస్ – బీపాస్​ను మొదట పైలట్ ప్రాజెక్టుగా 87 మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 1,100 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీ-పాస్ విధానాన్ని అమలు చేయనుంది రాష్ట్ర సర్కార్.