తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం…రాష్ట్ర ప్ర‌జ‌లు ఏపీకి వెళ్లకుండా నిషేధం..

|

May 01, 2020 | 9:34 AM

తెలంగాణలో క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. క‌రోనా క‌ట్టడిలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు స‌త్ప‌లితాల‌ను ఇస్తున్నాయి. ఇదే క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర‌ ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్‌కు, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మెడిక‌ల్ ట్రీట్మెంట్, ఎమ‌ర్జెన్సీ ప‌నుల‌కు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని […]

తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ప్ర‌జ‌లు ఏపీకి వెళ్లకుండా నిషేధం..
Follow us on

తెలంగాణలో క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. క‌రోనా క‌ట్టడిలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు స‌త్ప‌లితాల‌ను ఇస్తున్నాయి. ఇదే క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర‌ ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్‌కు, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం విధించింది.

ఆయా రాష్ట్రాల్లో క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మెడిక‌ల్ ట్రీట్మెంట్, ఎమ‌ర్జెన్సీ ప‌నుల‌కు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చెయ్య‌డానికి పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్నూలులో కరోనా కేసులు అధికంగా ఉన్న నేప‌థ్యంలో..ప‌క్క‌నే ఉన్న‌ తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు అక్కడికి వెళ్ల‌కుండా రాకపోకలను నిషేధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా సర్కార్ భద్రతను మ‌రింత‌ పెంచింది.