ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

| Edited By:

Jun 02, 2019 | 9:00 AM

ఆరు దశాబ్దాల పోరాటం.. అలుపెరగని ఆరాటం.. కొందరి బలిదానం.. వీటన్నింటి వల్లే ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. పార్లమెంట్‌లో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇక అదే సంవత్సరం జూన్ 2న దేశంలో 29వ నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఫలించగా.. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ […]

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Follow us on

ఆరు దశాబ్దాల పోరాటం.. అలుపెరగని ఆరాటం.. కొందరి బలిదానం.. వీటన్నింటి వల్లే ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. పార్లమెంట్‌లో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇక అదే సంవత్సరం జూన్ 2న దేశంలో 29వ నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఫలించగా.. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు తెలంగాణ 5వ అవతరణ దినోత్సవం జరుగుతుండగా.. అందుకోసం అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేసింది.

నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీఎం కేసీఆర్ ఇక్కడి వేడుకల్లో పాల్గొననుండగా.. సుమారు ఐదువేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటుతో పాటు వేసవి దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని జలమండలి ద్వారా కల్పించారు. మరోవైపు గన్‌పార్కులో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన అవాంతరాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కాగా తెలంగాణ భవన్‌లో జరిగే ఆవిర్భావ వేడుకల కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.