తెలంగాణ సెక్రటేరియట్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం..

|

Aug 03, 2020 | 8:41 PM

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాల్లోసమర్ధవంతమైన , ఖచ్చితమైన సేవలను అందించేందుకు 'ఈ-ఆఫీస్' ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఈ-ఆఫీస్ సేవలు ప్రారంభం..
Follow us on

E-Office Starts In Secretariat: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్ధవంతమైన , ఖచ్చితమైన సేవలను అందించేందుకు ‘ఈ-ఆఫీస్’ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బి.ఆర్.కె.ఆర్ భవన్‌లోని ఎనిమిది శాఖల్లో, హెచ్ఓడీలలోని రెండు శాఖల్లో ‘ఈ-ఆఫీస్’ సేవలను ప్రారంభించినట్లు సీఎస్ సోమేష్‌ కుమార్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా , బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. అంతేకాకుండా సమర్దవంతమైన పాలనను అందించవచ్చునని తెలిపారు. సెక్రటేరియట్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ , కార్మిక శాఖ, బీసీ సంక్షేమం, షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ , మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు , పీసీబీ. వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాలలో ఈ-ఆఫీసును ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెక్రటేరియట్‌లోని 15 శాఖలలో ఈ-ఆఫీసును అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన శాఖలలో ఈ-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..