ట్విట్టర్‍లో తెలంగాణ డీజీపీకి మూడు లక్షల ఫాలోయర్లు

|

Aug 07, 2020 | 4:51 PM

తెలంగాణ డీజీపీ ట్విట్టర్‍ హ్యాండిల్‍ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్‍లో డీజీపీ ఫాలోయర్ల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్‍రెడ్డి ట్విట్‍ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని.. ఇది తమ బాధ్యతలను మరింత పెంచిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ట్విట్టర్‍లో తెలంగాణ డీజీపీకి మూడు లక్షల ఫాలోయర్లు
Follow us on

తెలంగాణ డీజీపీ ట్విట్టర్‍ హ్యాండిల్‍ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్‍లో డీజీపీ ఫాలోయర్ల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్‍రెడ్డి ట్విట్‍ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని.. ఇది తమ బాధ్యతలను మరింత పెంచిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

నేరాలను తగ్గించడంలో తెలంగాణ పోలీసులు చురుకైనా పాత్ర పోషిస్తున్నారు. అపదలో ఉన్నవారికి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు స్వీకరిస్తూ పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజల నుండి ట్వీట్టర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వెంటనే స్పందిస్తూ ఇందుకు సంబంధత ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే డీజీపీ ట్విట్టర్‍ ప్రజలకు చేరువైంది. శాంతిభద్రతలతోపాటు, పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైనా డీజీపీ హ్యాండిల్‍కు ట్విట్‍ చేయగానే వేగంగా స్పందించారన్న పేరుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే తమ న్యాయం జరుగుతుండడం పట్ల జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ట్విట్టర్ విషయంలో… దేశంలోని డీజీపీల్లో మొదటి స్థానంలో ఉన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.