తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 612 మందికి కొవిడ్ పాజిటివ్

|

Dec 11, 2020 | 11:07 AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 612 కొత్త కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 612 మందికి కొవిడ్ పాజిటివ్
corona cases
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 612 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8గంటల నుంచి గురువారం రాత్రి 8గంటల వరకు 56,178 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 612 మందికి కొవిడ్ పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,76,516కి చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, గడిచిన 24గంటల్లో కరోనా బారినపడి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,485కి చేరింది.ఇక, మహమ్మారి బారి నుంచి గురువారం 502 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,604 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 5,511 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో 60,29,209 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.