Telangana Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

|

Feb 08, 2022 | 8:37 PM

Telangana Corona Update: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి...

Telangana Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Follow us on

Telangana Corona Update: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కోవిడ్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,061 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,79,971 ఉండగా, మొత్తం మరణాల సంఖ్య 4,102 ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు0.53 శాతం ఉండగా, రికవరీ రేటు 96.72 శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,470 ఉంది. ఇక తాజాగా రాష్ట్రంలో 69,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు 3,27,24,987 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కరోనా బారి నుంచి నిన్న 3,590 మంది కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Covid End: తెలంగాణ‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింది.. ఎలాంటి ఆంక్షలు లేవు.. కీలక ప్రకటన చేసిన డీహెచ్ శ్రీనివాస్

India Corona: హమ్మయ్య.. దేశవ్యాప్తంగా దిగివస్తున్న కరోనా మహమ్మారి.. నెల తర్వాత, వరుసగా రెండవ రోజు లక్షకు దిగువన కేసులు!