తెలంగాణ క‌రోనా లెటెస్ట్ అప్ డేట్స్..జిల్లాల వారీగా..

|

Jun 26, 2020 | 11:36 PM

తెలంగాణ‌లో కరోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. శక్రవారంలో కొత్తగా 985 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు  వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణ క‌రోనా లెటెస్ట్ అప్ డేట్స్..జిల్లాల వారీగా..
Follow us on

తెలంగాణ‌లో కరోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. శక్రవారంలో కొత్తగా 985 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు  వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు క‌రోనా వైరస్​ సోకిన వారి సంఖ్య 12,349కు చేరింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ పరిధిలో 774 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు రాగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 53, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 20, మెదక్‌ జిల్లాలో 9, ఆదిలాబాద్‌ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున.. భూపాలపల్లి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, జగిత్యాల, యాదాద్రి, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో ఒక్కొటి చొప్పున కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం క‌రోనాతో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 237కు చేరింది. శుక్రవారం వ్యాధి నుంచి తేరుకుని 78 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 7,436 మంది బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.