కంటైన్మెంట్ జోన్లలో 31 వరకు లాక్‌డౌన్.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

|

Jul 01, 2020 | 11:54 AM

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్‌‌ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కంటైన్మెంట్ జోన్లలో 31 వరకు లాక్‌డౌన్.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..
Follow us on

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్‌‌ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవోను జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగనుంది.

కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్ప మిగిలిన షాపులన్నీ కూడా రాత్రి 9.30 గంటల కల్లా మూసివేయాలన్నారు. కేంద్రం విధించిన అన్‌లాక్ 2.0 నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా, పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో లాక్ డౌన్, రూల్స్ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కొత్తగా 1068 అంబులెన్స్‌లను ప్రారంభించిన జగన్..