సైలెంట్ మోడ్‌లోకి తెలంగాణ కాంగ్రెస్.. రీజన్ ఇదే

|

Feb 13, 2020 | 2:32 PM

అసెంబ్లీ తర్వాత పార్లమెంట్‌…. ఆ తర్వాత లోకల్‌, మునిసిపాలిటీ, సహకార… ఇలా ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ఆ పార్టీ పరిస్థితి మాత్రం ఇంచు కూడా మారడం లేదు. నాయకత్వ లోపమా? లేక పార్టీ డీప్‌ ప్రిజ్‌లోకి వెళ్లిపోయిందా? అసలు ఆ పార్టీకి ఏమైంది? ఇదే ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే….పార్లమెంట్‌ ఎన్నికల్లో చతికిలపడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మూడంటే మూడు ఎంపీ సీట్లు గెలిచింది. […]

సైలెంట్ మోడ్‌లోకి తెలంగాణ కాంగ్రెస్.. రీజన్ ఇదే
Follow us on

అసెంబ్లీ తర్వాత పార్లమెంట్‌…. ఆ తర్వాత లోకల్‌, మునిసిపాలిటీ, సహకార… ఇలా ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ఆ పార్టీ పరిస్థితి మాత్రం ఇంచు కూడా మారడం లేదు. నాయకత్వ లోపమా? లేక పార్టీ డీప్‌ ప్రిజ్‌లోకి వెళ్లిపోయిందా? అసలు ఆ పార్టీకి ఏమైంది? ఇదే ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే….పార్లమెంట్‌ ఎన్నికల్లో చతికిలపడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మూడంటే మూడు ఎంపీ సీట్లు గెలిచింది. బీజేపీ కంటే ఓ సీటు తక్కువే గెలుచుకుంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యం.. పరిషత్‌ ఎన్నికల్లో ఫైట్‌ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న మునిసిపల్ ఎన్నికల్లో అదే సేమ్‌ సీన్‌. ఇలా వరుస ఓటములతో కాంగ్రెస్‌ ఢీలా పడిపోతోంది. ఇలాంటి టైమ్‌లో వచ్చిన సహకార ఎన్నికలపై కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారిస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ ఎన్నికలపై పార్టీ ఫోకస్‌ పెట్టడం లేదు.

గాంధీభవన్‌లో ఏదో ఒక మొక్కుబడి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినాయకత్వం చేతులు దులుపుకుంది. తీరా గ్రౌండ్ లెవల్లో చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవాల మీద ఏకగ్రీవాలు చేసుకుంటూ వెళ్లింది. మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకావడంలేదు. గతంలో గెలిచిన స్థానాలపై కూడా ఫోకస్‌ పెట్టడం లేదు.

వరుస ఓటములపై కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. ఓటములపై విశ్లేషణ జరగడం లేదని…కనీసం ఎందుకు ఓడిపోయాం? అని పోస్టుమార్టం చేసుకోవడం లేదని..భవిష్యత్‌లో పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల గురించి రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం కార్యకర్తల్లో అసహనం నెలకొంది. రాష్ట్ర నాయకత్వ మార్పు వల్లే పార్టీకి పునర్‌ వైభవం వస్తుందని…పార్టీ అధిష్టానం వెంటనే తెలంగాణకు కొత్త టీమ్‌ను ప్రకటించాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఎందుకో తెలంగాణ నాయకత్వ మార్పుపై స్పందించడం లేదు.

మరోవైపు నాయకత్వ మార్పు కంటే పార్టీలో సమన్వయలోపం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఎంపీగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్లమెంట్‌ సమావేశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సహకార సంఘం ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టలేదని ఆయన వర్గం అంటోంది. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీకి కొత్త ఊపిరి పోయాలనేది మెజార్టీ కాంగ్రెస్‌ నేతల వాదన. మరీ ఈ నేతల మాటను ఢిల్లీ పెద్దలు ఎప్పుడూ పట్టించుకుంటారో చూడాలి.