రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు.. వారికి కీలక బాధ్యతలు..

|

Sep 09, 2020 | 4:18 PM

భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కొత్త రెవెన్యూ చట్టం కీలక మార్పులను తీసుకు రాబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్లను అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌గా విభజించి..

రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు.. వారికి కీలక బాధ్యతలు..
Follow us on

Changes In Registrations: భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కొత్త రెవెన్యూ చట్టం కీలక మార్పులను తీసుకు రాబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్లను అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌గా విభజించి.. అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్లను తహశీల్దార్‌లకు, నాన్‌ అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను సబ్‌- రిజిస్ట్రార్‌లకు అప్పగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌- రిజిస్ట్రార్లు ఇక వ్యవసాయ భూముల జోలికి వెళ్లే అవకాశమే లేదని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఏ రకమైన భూమినైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని కేసీఆర్ తెలిపారు. అటు భూముల రిజిస్ట్రేషన్‌ తర్వాత నిమిషాల్లోనే డాక్యుమెంట్స్‌ను హక్కుదార్లకు అందిస్తామన్నారు. ఇటు తహశీల్దార్‌ కార్యాలయంలో గానీ, అటు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గాని ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగిన వెంటనే ధరణీ పోర్టల్లో కూడా రికార్డులను నిమిషాల్లోనే అప్‌డేట్‌ చేస్తామని తెలిపారు. అమ్మకదారులకు, కొనుగోలుదారులకు నిమిషాల వ్యవధిలోనే వారి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను అందజేస్తామన్నారు.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!