హస్తిన పర్యటనలో కేసీఆర్ చతురత..! రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడకుండా వ్యూహాత్మక అడుగులు

|

Dec 12, 2020 | 10:05 PM

తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది..

హస్తిన పర్యటనలో కేసీఆర్ చతురత..! రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడకుండా వ్యూహాత్మక అడుగులు
Follow us on

తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుంచి బీజేపీతో రాజకీయంగా వైరం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేశాక మాత్రం కేంద్రంతో సఖ్యంగానే ఉంటూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నిర్ణయాల్లో అంశాలవారిగా సమర్థిస్తూ, కొన్ని నిర్ణయాలపై విబేధిస్తూ ప్రయాణం ముందుకు సాగించారు. అయితే తాజాగా జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధానంగా పోరు సాగింది. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఫలితాల సంగతెలా ఉన్నా ఆ రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడకుండా ఉండాలంటే కేంద్ర పెద్దలను స్వయంగా కలిసి నిధులు రాబట్టుకోవడమే ఉత్తమమని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. కేంద్రంతో నిత్యం ఆయా అంశాలపై సంప్రదింపులు జరుపుతూ నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తు చేస్తూ, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు కోరుతూ ఢిల్లీలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఆదివారం వీలుంటే ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసి తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది.