తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత

|

Oct 13, 2020 | 1:50 PM

ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగాల భర్తీ కోసమని వీళ్లంతా అసెంబ్లీ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదంటూ బీజేపీ నేతలు.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సీపీఐ […]

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
Follow us on

ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగాల భర్తీ కోసమని వీళ్లంతా అసెంబ్లీ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదంటూ బీజేపీ నేతలు.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సీపీఐ నేతలు.. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిరసనకారులు అసెంబ్లీ దగ్గరకు దూసుకురావడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు‌ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు.