ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెలలో రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ స‌మావేశాల్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది.

ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు
Follow us

|

Updated on: Oct 09, 2020 | 8:25 PM

ఈ నెలలో రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ స‌మావేశాల్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మరికొన్ని అంశాలపై చర్చించేందుకు ఈ 2 రోజులపాటు  ప్రత్యేక భేటీ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సమావేశాల నిర్వహణ తీరు, ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పలు కీలకమైన బిల్లులతోపాటు ముఖ్యమైన అంశాలపై గత నెల 6 నుంచి 16 వరకు అసెంబ్లీ సమా వేశాలు జరిగాయి. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. 14న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది. ఈ స‌మావేశాల్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది.

త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌ చట్టంలో పేర్కొన్న విధంగా గ్రేటర్‌ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం కలిగినవారు కూడా పోటీ చేసే అంశంపై చట్టసవరణ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్‌ఆర్‌ఎస్, జీవో 58, 59కు సంబం ధించి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రకటన చేసే అవకాశముంది.