తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

|

Sep 10, 2020 | 1:52 PM

తెలంగాణ శాసనసభ వర్షకాల సమావేశాలు నాలుగో రోజు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం. జీరో అవ‌ర్ కొనసాగింది.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Follow us on

తెలంగాణ శాసనసభ వర్షకాల సమావేశాలు నాలుగో రోజు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. జీరో అవ‌ర్ ముగిసిన అనంత‌రం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ ప్ర‌క‌టించారు. గురువారం శాసనసభలో ఆసరా పెన్ష‌న్లు, ఆయిల్ ఫామ్ సాగు, గ్రామ‌పంచాయ‌తీల అభివృద్ధి, ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థతో పాటు ఇత‌ర అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగాయి. జీరో అవ‌ర్‌లో స‌భ్యులు ప్ర‌తిపాదించిన స‌మ‌స్య‌ల‌ను మంత్రులు నోట్ చేసుకున్నారు. శుక్ర‌వారం కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లుపై విస్తృతంగా చ‌ర్చ జరుగనుంది.

కాగా, సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రులు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మాట్లాడారు. సభలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నిరంజన్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారని స్పష్టం చేశారు. భవిషత్ లో వ్యవసాయరంగం ద్వారా ఉపాధి అవ‌కాశాలు, స్థూల ఆదాయంతో మెరుగుపడుతుందన్నారు.