తెలంగాణ జైళ్ల శాఖ మ‌రో ఘ‌న‌త‌

|

Sep 02, 2020 | 1:44 PM

తెలంగాణ జైళ్ల శాఖ మరో అరుదైన‌ ఘ‌నత సొంతం చేసుకుంది. 2019లో తెలంగాణ జైళ్ల‌లో ఉన్న ఖైదీలు 600 కోట్ల రూపాయల వస్తువులు ఉత్పత్తి చేశారు.

తెలంగాణ జైళ్ల శాఖ మ‌రో ఘ‌న‌త‌
Follow us on

తెలంగాణ జైళ్ల శాఖ మరో అరుదైన‌ ఘ‌నత సొంతం చేసుకుంది. 2019లో తెలంగాణ జైళ్ల‌లో ఉన్న ఖైదీలు 600 కోట్ల రూపాయల వస్తువులు ఉత్పత్తి చేశారు. ఈ విష‌యంలో తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోనే టాప్ ప్లేసులో నిలిచింది. మిగిలిన రాష్ట్రాలు క‌నీసం ద‌రిదాపుల్లో కూడా లేవు. రెండో స్థానంలో త‌మిళ‌నాడు వ్యాప్తంగా జైళ్లలో ఉన్న‌ ఖైదీలు 72 కోట్ల విలువైన‌ వస్తువులు ఉత్ప‌త్తి చేశారు. మూడో స్థానంలో మ‌హారాష్ట్ర ఉంది. అక్క‌డి ఖైదీలు 29 కోట్ల రూపాయ‌ల వ‌స్తువులు ఉత్ప‌త్తి చేశారు. కాగా తెలంగాణ‌లో ఖైదీలు త‌యారు చేస్తోన్న వస్తువుల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో మాస్క్‌ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేశారు ఖైదీలు.

 

Also Read :

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు

మృతి చెందిన ప‌వ‌న్ ఫ్యాన్స్ కుటుంబాల‌కు బన్నీ ఆర్థిక సాయం