నీట్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

|

Oct 18, 2020 | 4:52 PM

మన నుంచి లాక్కోలేని సంపద ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. అందుకే ఆకలి నేర్పిన పాఠాలతో పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టారు.

నీట్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
Follow us on

మన నుంచి లాక్కోలేని సంపద ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. అందుకే ఆకలి నేర్పిన పాఠాలతో పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టారు. ఇష్టపడి, కష్టపడి చదివితే విజయాలతో పాటు ర్యాంకులు కూడా దాసోహం అవుతాయని నిరూపించారు. వైద్యవిద్య ఎంట్రన్స్ టెస్ట్ నీట్‌లో తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల జూనియర్‌ కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 190 మంది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కేటగిరీ, జనరల్‌ ర్యాంకులు సాధించారు. ఎస్సీ సొసైటీ నుంచి 142 మంది, ఎస్టీ సొసైటీ నుంచి 48 మంది స్టూడెంట్స్‌కు ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌ సీట్లు లభించే చాన్స్ ఉందని సొసైటీల కార్యదర్శి  ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

‘‘పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాంకులు పొందారు. ఎగ్జామ్‌కు కొన్నిరోజుల ముందు కోవిడ్ సోకినా పరీక్ష రాసిన అభిలాష్‌ ఎస్సీ కేటగిరిలో 168 ర్యాంకు సాధించారు. గిరిజన విద్యార్థి దేజావత్‌ గిరిజ ఎస్టీ కేటగిరీలో 85వ ర్యాంకు పొందారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ఆపరేషన్‌ బ్లూక్రిస్టల్‌, ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ కింద మెరుగైన ట్రైనింగ్ అందించాం. కూలీ కుటుంబం నుంచి వచ్చిన కె.వంశీధర్‌ 554 మార్కులు సాధించి ఎంబీబీఎస్‌ సీటుకు అర్హత పొందారు. పూట గడవని పరిస్థితుల్లో ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన వై.పూజిత 532 మార్కులు (కేటగిరీ ర్యాంకు 1969) తెచ్చుకున్నారు. సిరిసిల్లకు చెందిన కె.నిక్షిప్త 535 మార్కులు సాధించారు. ఆమె తల్లి ఇళ్లలో వంటపని చేస్తున్నారు’’ అని ప్రవీణ్‌కుమార్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో 180 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 3,840 మంది స్టూడెంట్స్ బైపీసీ కోర్సును అభ్యసిస్తున్నారు. వీరిలో నీట్‌ ఎగ్జామ్‌కు 560 మంది విద్యార్థులు హాజరయ్యారని సొసైటీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ సొసైటీ నుంచి 350 మంది, ఎస్టీ సొసైటీ నుంచి 210 మంది పరీక్ష రాశారని వెల్లడించారు. ( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )