విక్రమాదిత్య నుంచి విజయవంతంగా ‘తేజస్’ టేకాఫ్!

| Edited By:

Jan 13, 2020 | 4:01 PM

దేశీయంగా నిర్మించిన తేజస్ లైట్ కంబాట్ విమానం ఆదివారం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య యొక్క “స్కీ-జంప్” డెక్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. స్కీ-జంప్ అనేది ఫైటర్ జెట్‌లకు తగిన టేకాఫ్ లిఫ్ట్‌ను అందించడానికి రూపొందించిన విమాన వాహక నౌకల డెక్‌పై ఉండే రాంప్. శనివారం ఈ విమానం ఐఎన్ఎస్ విక్రమాదిత్య డెక్ మీద మొదటిసారిగా ల్యాండ్ అయింది. విమానం ద్వారా ల్యాండింగ్, టేకాఫ్ రెండూ ఒక విమాన వాహక నౌక నుండి పనిచేయగల […]

విక్రమాదిత్య నుంచి విజయవంతంగా తేజస్ టేకాఫ్!
Follow us on

దేశీయంగా నిర్మించిన తేజస్ లైట్ కంబాట్ విమానం ఆదివారం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య యొక్క “స్కీ-జంప్” డెక్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. స్కీ-జంప్ అనేది ఫైటర్ జెట్‌లకు తగిన టేకాఫ్ లిఫ్ట్‌ను అందించడానికి రూపొందించిన విమాన వాహక నౌకల డెక్‌పై ఉండే రాంప్. శనివారం ఈ విమానం ఐఎన్ఎస్ విక్రమాదిత్య డెక్ మీద మొదటిసారిగా ల్యాండ్ అయింది.

విమానం ద్వారా ల్యాండింగ్, టేకాఫ్ రెండూ ఒక విమాన వాహక నౌక నుండి పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది నౌకాదళ యుద్ధ విమానాలకు కీలకం. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), ఎయిర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ ఆఫ్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) లు సంయుక్తంగా ఈ వాహక నౌకను తయారుచేశాయి.

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై శనివారం విమానం విజయవంతంగా ల్యాండ్ అయిన తరువాత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని భారత యుద్ధ విమానాల చరిత్రలో ఒక గొప్ప సంఘటనగా పేర్కొన్నారు.

[svt-event date=”13/01/2020,3:58PM” class=”svt-cd-green” ]