జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టిన యువకుడు.. వీడియో వైరల్

| Edited By:

Jun 28, 2019 | 9:03 AM

చిన్నారి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు ఓ యువకుడు. భవనంపై నుంచి కిందపడుతోన్న చిన్నారిని రెండు చేతులతో క్యాచ్‌ పట్టుకొని ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో దోహా మహ్మద్ అనే చిన్నారి అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఆడుకుంటోంది. ఆ క్రమంలో రెండో అంతస్తులోని కిటీకి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. సరిగ్గా అదే […]

జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టిన యువకుడు.. వీడియో వైరల్
Follow us on

చిన్నారి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు ఓ యువకుడు. భవనంపై నుంచి కిందపడుతోన్న చిన్నారిని రెండు చేతులతో క్యాచ్‌ పట్టుకొని ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో దోహా మహ్మద్ అనే చిన్నారి అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఆడుకుంటోంది. ఆ క్రమంలో రెండో అంతస్తులోని కిటీకి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న 17ఏళ్ల ఫ్యూజీ అనే యువకుడు చిన్నారిని చేతులతో పట్టుకొని ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో సీసీ టీవీలో రికార్డు అవ్వడంతో ఫ్యూజీ జబాత్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఇక చిన్నారిని కాపాడిన బజాత్‌కు ఆ కుటుంబం కృతఙ్ఞతలు చెబుతూ ఓ బహుమానం కూడా ఇచ్చారు.