సీఎం జగన్‌పై అసభ్యకర పోస్ట్.. టీడీపీ కార్యకర్త అరెస్ట్..!

| Edited By: Srinu

Jul 09, 2019 | 12:41 PM

సీఎం జగన్‌పై ఫేస్‌బుక్ పేజీలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన టిడిపి కార్యకర్త రాజేష్ నాయుడును పెనుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాజేష్.. మే 28న ఫేస్‌బుక్‌లో.. సీఎం జగన్‌పై అనుచిత పోస్టింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెనుమూరు మండలం దేవికాపురంకు చెందిన వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేష్‌పై ఐపిసి 506, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న జరిగిన […]

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్ట్.. టీడీపీ కార్యకర్త అరెస్ట్..!
Follow us on

సీఎం జగన్‌పై ఫేస్‌బుక్ పేజీలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన టిడిపి కార్యకర్త రాజేష్ నాయుడును పెనుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాజేష్.. మే 28న ఫేస్‌బుక్‌లో.. సీఎం జగన్‌పై అనుచిత పోస్టింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెనుమూరు మండలం దేవికాపురంకు చెందిన వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేష్‌పై ఐపిసి 506, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తల మీద జరిగిన దాడి కేసులో కూడా రాజేష్ నిందితుడు.