ఆ అంశాలపై లుక్కేయండి.. మనమేంటో తెలుస్తుందన్న బాబు

|

Apr 09, 2020 | 2:15 PM

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను కరోనా ప్రభావంతోను, లాక్ డౌన్ వల్లను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఆ అంశాలపై లుక్కేయండి.. మనమేంటో తెలుస్తుందన్న బాబు
Follow us on

Chandrababu advised party leaders to focus on public issues: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను కరోనా ప్రభావంతోను, లాక్ డౌన్ వల్లను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండు ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామంటూ ఊదర గొడుతున్నాయని, వాటిలో తలెత్తుతున్న లోపాలను పట్టించుకోవడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కమిడి కళా వెంకట్రావు, ఎల్. రమణలతోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జిల్లాల్లో కరోనా వ్యాప్తి, నియంత్రణా చర్యలు, లాక్ డౌన్ తదనంతర పరిణామాలపై ఆయన పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చలు జరిపారు.

రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఉపాధి లేక కూలీల ఇక్కట్లు, ప్రజా సమస్యలపై పార్టీ నేతలు దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్య కనిపించినా దాన్ని అధికార వర్గాల దృష్టికి తేవడంతోపాటు మీడియాకు కూడా తెలియజేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని చంద్రబాబు సూచించారు. లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో ఒకవేళ పొడిగిస్తే.. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, వాటి పరిష్కారానికి ఏం చేయాలనే అంశాలపై కూడా చంద్రబాబు పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.