టీడీపీని ఓడించిన వ్యక్తిని.. సన్మానిస్తారనుకుంటే.. ఇలా చేశారేంటి సీఎం గారూ..!

| Edited By:

Feb 09, 2020 | 3:24 PM

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై ప్రతిపక్ష నాయకులు స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయడంపై.. టీడీపీ ఎంపీ కేశినేని నానీ.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు వల్లే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై.. మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కీలక పాత్ర పోషించిన వ్యక్తికి సన్మానం చేస్తామనుకుంటే.. ఇలా చేశారేంటి అంటూ ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. మీరు @ysjagan […]

టీడీపీని ఓడించిన వ్యక్తిని.. సన్మానిస్తారనుకుంటే.. ఇలా చేశారేంటి సీఎం గారూ..!
Follow us on

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై ప్రతిపక్ష నాయకులు స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయడంపై.. టీడీపీ ఎంపీ కేశినేని నానీ.. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు వల్లే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై.. మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కీలక పాత్ర పోషించిన వ్యక్తికి సన్మానం చేస్తామనుకుంటే.. ఇలా చేశారేంటి అంటూ ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

కాగా, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును శనివారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నాడని వేటువేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్టీ ఇన్‌ప్లేటబుల్స్‌ అనే సంస్థకు.. సెక్యూరిటీ ఎక్యుప్‌మెంట్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆ సంస్థ తరపున బిడ్‌ దాఖలు చేసిన వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌.. టెండర్ల ప్రక్రియలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. డమ్మీ కంపెనీలతో బిడ్లు వేయించారని ప్రభుత్వం స్పష్టంచేసింది. తన కుమారుడు చేతన్‌కు కాంట్రాక్ట్ ఇప్పించుకున్న ఆయనను.. గత ఏడాది మే 30న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవి నుంచి.. జగన్ సర్కార్ తొలగించింది. అప్పటి నుంచి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నివేదిక మేరకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెన్షన్‌ చేసినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదన్న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.