ఎక్సైజ్ పాలసీ.. వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది: రామానాయుడు

| Edited By: Ravi Kiran

Dec 16, 2019 | 11:15 AM

వాడీ వేడిగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతోన్నాయి. ఈరోజు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా 11 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వాటిపై హాట్‌గా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా.. మద్యంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని అన్నారు. మద్యం నియంత్రణకై వైసీపీ రేట్లు పెంచడం సమంజసం కాదన్నారు. ధరలు […]

ఎక్సైజ్ పాలసీ.. వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది: రామానాయుడు
Follow us on

వాడీ వేడిగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతోన్నాయి. ఈరోజు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా 11 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వాటిపై హాట్‌గా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా.. మద్యంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని అన్నారు. మద్యం నియంత్రణకై వైసీపీ రేట్లు పెంచడం సమంజసం కాదన్నారు. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందని అన్నారు కానీ.. పేద ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారు కదా.. అంటే ప్రయాణికులు తగ్గాలని మీ ప్రయత్నమా అంటూ ఆయన చతుర్లు విసిరారు. వైన్‌ షాపుల నుంచి బార్లకు అక్రమంగా మద్యం సరఫరా అవుతోందని.. ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. బ్రాందీ షాపుల్లో ఒక రేటు ఉందని.. బార్లలో మరొక రేటుందని అన్నారు. బెల్ట్ షాపులు పోయి.. మొబైల్ షాపులొచ్చాయన్నారు.