TDP Left friendship: ఏపీలో కొత్త సమీకరణలు.. లెఫ్ట్‌తో బాబు దోస్తీ!

|

Mar 06, 2020 | 7:14 PM

సమ్మర్‌ సీజన్‌ మొదలుకాలేదు కానీ ఏపీలో పొలిటికల్‌ వేడి మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. స్థానిక సమరం షెడ్యూల్‌ ఖరారైంది. మరోవైపు పొత్తులపై పొలిటికల్‌ లెక్కలు మొదలయ్యాయి. వైసీపీ సింగిల్‌గా చక్రం తిప్పుతుంటే..

TDP Left friendship: ఏపీలో కొత్త సమీకరణలు.. లెఫ్ట్‌తో బాబు దోస్తీ!
Follow us on

Left parties in Andhra joining hands with TDP: సమ్మర్‌ సీజన్‌ మొదలుకాలేదు కానీ ఏపీలో పొలిటికల్‌ వేడి మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. స్థానిక సమరం షెడ్యూల్‌ ఖరారైంది. మరోవైపు పొత్తులపై పొలిటికల్‌ లెక్కలు మొదలయ్యాయి. వైసీపీ సింగిల్‌గా చక్రం తిప్పుతుంటే.. బీజేపీ, జనసేన కలిసి పోటీకి రెడీ అవుతున్నాయి. రాజధాని పోరాటంలో కలిసి పనిచేస్తున్న తెలుగుదేశం, వామపక్షాలు స్థానిక ఎన్నికల్లో జతకడతాయన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి.

ఏపీలో ఎన్నికల ఫీవర్‌ మొదలైంది. మార్చిలో వరుస ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. షెడ్యూల్‌ ఒకసారి విడుదల అయితే…ఎన్నికల సమరంలోకి రాజకీయ పార్టీలు దిగడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ జిల్లాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలని మంత్రులకు సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఒక్క స్థానం చేజారినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో స్థానిక సమరాన్ని అధికార పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీది ఒంటరిపోరాటమే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సింగిల్‌గానే పోటీ చేయబోతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఏ పార్టీతో సర్దుబాట్లు చేసుకోలేదు. ఒంటరిపోరాటంతో చాలా నష్టపోయింది. దీంతో ఈసారి వామపక్షాలతో కలిసి స్థానిక సమరానికి సిద్ధం కావాలని అనుకుంటోంది. ఇప్పటికే తెలుగుదేశం,లెప్ట్‌ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు యత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంపై చర్చ జరిగింది. మార్చి 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈమీటింగ్‌ తర్వాత టీడీపీతో కలిసి నడిచే విషయంపై క్లారిటీ రాబోతుంది.

టీడీపీతో పొత్తులకు సీపీఐ సానుకూలంగా ఉన్నా.. సీపీఎం మాత్రం ఇంకా నోరుమెదపడం లేదు. అమరావతి సహా ఇతర అంశాలపై సీపీఎం పార్టీ టీడీపీకి దూరంగా ఉంటోంది. తెలుగుదేశం నేతల నుంచి ప్రతిపాదన వస్తే.. అప్పుడు పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలతో జతకట్టిన జనసేన ఈ సారి బీజేపీతో కలిసి పోటీకి దిగుతోంది. ఇరుపార్టీలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. సీట్లు, సర్దుబాట్లపై పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్ హస్తిన టూరులో బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. శనివారం షెడ్యూల్‌ విడుదల కానుండడంతో ఊరూవాడా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. విపక్షాలు పొత్తులపై దృష్టిపెడితే… అధికాపార్టీ గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.

Read this also: ఏపీలో జడ్పీ రిజర్వేషన్లు ఇవే ZP Chairman reservations finalized in Andhra