‘మళ్లీ దూకేస్తాడేమో’..చిరూపై, సోమిరెడ్డి ఘాటు సెటైర్లు

|

Dec 23, 2019 | 1:09 PM

ఏపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రకటనపై  ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అనూహ్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ ప్రకటనపై రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఈ విషయం పక్కన పెడితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి, రాజధానిపై జగన్ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయమని..అందుకు అందరూ సహకరించాలని ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీలోని ఒక వర్గం నేతలు చిరుపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి అయితే చిరంజీవిపై ఘాటు […]

మళ్లీ దూకేస్తాడేమో..చిరూపై, సోమిరెడ్డి ఘాటు సెటైర్లు
Follow us on

ఏపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రకటనపై  ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అనూహ్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ ప్రకటనపై రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఈ విషయం పక్కన పెడితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి, రాజధానిపై జగన్ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయమని..అందుకు అందరూ సహకరించాలని ప్రకటన విడుదల చేశారు.

ఈ వ్యవహారంపై టీడీపీలోని ఒక వర్గం నేతలు చిరుపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి అయితే చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ టీడీపీ స్ట్రాటజీ కాస్త విభిన్నంగా ఉంది. ఒకవైపు చిరంజీవిని ఉతికి ఆరేస్తూ, మరోవైపు పవన్‌‌పై తమ సానుకూల ధోరణిని ప్రదర్శిస్తోంది ఎల్లో పార్టీ. ఎంతోమంది నమ్మిన  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపి, పదవులను అనుభవించి.. రాష్ట్ర విభజనలో పాపంలో  చిరు భాగమయ్యారంటూ సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ క్యాపిటల్ విషయంలో ప్రజల పక్షాన పోరాడుతోన్న తమ్ముడికి మద్దతివ్వకుండా, కొత్త పాట పాడటం వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆయన విమర్శించారు. వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్ద మనిషికి జనం కష్టాలు ఏం తెలుస్తాయన్న సోమి రెడ్డి..మళ్లీ దూకేస్తాడేమో అంటూ చిరుపై సెటైర్లు వేశారు.