‘రాజ్యాధినేతలెవరో, జైలుకెళ్లేవారెవ్వరో..’

స్థానిక సంస్థలకు జగన్ ప్రభుత్వం శఠగోపం పెట్టిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో ఒక్క అభివృద్ధీ చేయట్లేదన్నారు. ‘నరేగా'(మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం) కింద కేంద్రం మంజూరు చేసిన రూ.2 వేల కోట్లు కూడా చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని బుచ్చయ్య ఆరోపించారు. ఆర్థిక నేరగాడైన ముఖ్యమంత్రి సారధ్యంలో నీతి వాఖ్యాలు చెప్తూ ప్రభుత్వం అవినీతిని యథేచ్ఛగా కొనసాగిస్తోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు […]

'రాజ్యాధినేతలెవరో, జైలుకెళ్లేవారెవ్వరో..'
Follow us

|

Updated on: Oct 10, 2020 | 4:43 PM

స్థానిక సంస్థలకు జగన్ ప్రభుత్వం శఠగోపం పెట్టిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో ఒక్క అభివృద్ధీ చేయట్లేదన్నారు. ‘నరేగా'(మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం) కింద కేంద్రం మంజూరు చేసిన రూ.2 వేల కోట్లు కూడా చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని బుచ్చయ్య ఆరోపించారు. ఆర్థిక నేరగాడైన ముఖ్యమంత్రి సారధ్యంలో నీతి వాఖ్యాలు చెప్తూ ప్రభుత్వం అవినీతిని యథేచ్ఛగా కొనసాగిస్తోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో క్విడ్ ప్రోకో కేసుల్లో జరిగిన అవినీతే నేడూ కొనసాగుతోందన్నారు. ఆన్ గోయింగ్ పథకంగా అవినీతిలో మళ్లీ సహ నిందుతులే ఉన్నారని బుచ్చయ్య సెటైర్లు వేశారు.

మంత్రులు కబ్జాదారులుగా మారారని.. అన్ని సాక్ష్యాలతో అవినీతి బయటపడుతున్నా ఏ ఒక్కరిపైనా చర్యలు లేవని బుచ్చయ్య చౌదరి అన్నారు. పాఠశాలలకూ పార్టీ రంగులేసే దౌర్భాగ్యం నెలకొందన్న ఆయన.. న్యాయవ్యవస్థ లేకపోతే అరాచకం ఎక్కడికి చేరేదో.. అని వాపోయారు. కోర్టుల్లో నేరస్థులపై కేసుల విచారణ త్వరగా పూర్తైతే… రాజ్యధినేతలు ఎవరో, జైలుకెళ్లేవారెవ్వరో తేలిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.