‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని దుస్ధితి ఇక్కడుంది’

|

Oct 01, 2020 | 2:40 PM

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని దుస్ధితి ఆంధ్రాలో నెలకొందని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. పదవులు అలంకరించినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామన్న ప్రమాణాలు పేరుకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. ఎమ్ఆర్ కళాశాల అంశం విజయనగర ప్రాంత చరిత్రతో ముడిపడిన అంశమని చెప్పిన అశోక్.. ఎమ్ఆర్ కళాశాలను ప్రయివేటు పరం ఎందుకు చేయాలనుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎందరెందరు మహనీయులు ఆ కళాశాల నుండి తయారయ్యారో తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. […]

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని దుస్ధితి ఇక్కడుంది
Follow us on

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని దుస్ధితి ఆంధ్రాలో నెలకొందని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. పదవులు అలంకరించినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామన్న ప్రమాణాలు పేరుకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. ఎమ్ఆర్ కళాశాల అంశం విజయనగర ప్రాంత చరిత్రతో ముడిపడిన అంశమని చెప్పిన అశోక్.. ఎమ్ఆర్ కళాశాలను ప్రయివేటు పరం ఎందుకు చేయాలనుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఎందరెందరు మహనీయులు ఆ కళాశాల నుండి తయారయ్యారో తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని.. దేశంలో ప్రసిద్ధిపొందిన మాన్సాస్ సంస్ధకు సంబంధించిన మార్గదర్శకాలు, ఉద్దేశ్యాలు స్పష్టంగా రికార్డులలో లిఖితపూర్వకంగా పొందుపరిచబడి ఉన్నాయని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం సరైన ధోరణిలో వ్యవహరించటం లేదని అశోక్ గజపతిరాజు చెప్పుకొచ్చారు.