‘నియామకాల తీరుకు ఇది మచ్చుతునక’

|

Oct 01, 2020 | 1:35 PM

రాజకీయ విమర్శలపై వైసీపీ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ.. రాష్ట్రంలోని దేవాలయాల పటిష్టతపై చూపడం లేదని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల పాలకమండళ్ల సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చుక్కా నాగ వెంకట వరలక్ష్మి కారులో అక్రమ మద్యం లభించడం జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని డిమాండ్ చేసిన కళా.. దేవాదాయశాఖ మంత్రి కనుసన్నల్లోనే […]

నియామకాల తీరుకు ఇది మచ్చుతునక
Follow us on

రాజకీయ విమర్శలపై వైసీపీ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ.. రాష్ట్రంలోని దేవాలయాల పటిష్టతపై చూపడం లేదని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల పాలకమండళ్ల సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చుక్కా నాగ వెంకట వరలక్ష్మి కారులో అక్రమ మద్యం లభించడం జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని డిమాండ్ చేసిన కళా.. దేవాదాయశాఖ మంత్రి కనుసన్నల్లోనే పాలకమండలి సభ్యులు పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘రాజీనామా చేయాల్సింది బోర్డు సభ్యురాలు కాదు.. ముందు నైతిక బాధ్యతగా మంత్రి రాజీనామా చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

అక్రమ మద్యం ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. పాలకమండళ్ల నియామకాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలిపేందుకు తాజా ఘటన నిదర్శనమని ఆయన అన్నారు. హిందూ దేవుళ్ల పట్ల విశ్వాసం లేనివారికి పదవులు కట్టబెట్టి హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల ప్రతిష్టను పథకం ప్రకారం వైసీపీ మంటగలుపుతోందని.. లిక్కర్, శాండ్, మైనింగ్, ల్యాండ్ మాఫియాలతో దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపణలు గుప్పించారు.