వరల్డ్ నెంబర్ వన్ గా టీసీఎస్

|

Oct 09, 2020 | 8:03 AM

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా భారతదేశానికి చెందిన టీసీఎస్ నిలిచింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యాక్సెంచెర్ ను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

వరల్డ్ నెంబర్ వన్ గా టీసీఎస్
TCS announces salary hike
Follow us on

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా భారతదేశానికి చెందిన టీసీఎస్ నిలిచింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యాక్సెంచెర్ ను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా సమయంలో నిరంతరాయంగా ఐటీ సేవలను అందిస్తూ తన వ్యాపారాన్నికొనసాగించింది టాటా కన్సల్టెన్సీ. షేర్ మార్కెట్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ షేర్ దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973 కోట్లకు చేరింది. డాలర్లలో పోల్చితే ఈ విలువ 144.73 బిలియన్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ విలువ 142.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో మార్కెట్ విలువ ఆధారంగా ఐటీ రంగంలో టీసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక, మరో ఐటీ దిగ్గజం ఐబీఎం మాత్రం 110.5 బిలియన్ డాలర్ల సమపార్జనతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
.