ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటామోటార్స్ రెడీ!

| Edited By:

Jul 07, 2019 | 7:29 PM

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. పర్యావరణ అనుకూలమైన ఈ వాహనాలను ఉత్పత్తి చేసి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో అవసరమని టాటా మోటార్స్‌ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని.. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధంగా […]

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటామోటార్స్ రెడీ!
Follow us on

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. పర్యావరణ అనుకూలమైన ఈ వాహనాలను ఉత్పత్తి చేసి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో అవసరమని టాటా మోటార్స్‌ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని.. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందన్నారు వాటాదారులకు పంపిన లేఖలో తెలిపారు. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు సాగుతున్న ఈ మార్పును ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.