Tata EV Cars: క్రాష్‌ టెస్ట్‌లో సత్తా చాటిన టాటా ఈవీ కార్స్‌.. ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో ఇతర కంపెనీలకు గట్టి పోటీ

సాధారణంగా బీఎన్‌సీఏపీ సూచించే ఇండియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ధ్రువీకరణ పొందిన మొదటి కంపెనీగా స్వదేశ కంపెనీ అయిన టాటా నిలిచింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రాష్ పరీక్షలను నిర్వహించి, భద్రతా లక్షణాలతో సాంకేతికత అంశాలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతా పనితీరును సూచించడానికి సాధారణ స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది.

Tata EV Cars: క్రాష్‌ టెస్ట్‌లో సత్తా చాటిన టాటా ఈవీ కార్స్‌.. ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో ఇతర కంపెనీలకు గట్టి పోటీ
Tata Crash Test
Follow us

|

Updated on: Jun 17, 2024 | 8:00 AM

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ తయారీదారు టాటా మోటార్స్ భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాల్లో దాని పంచ్‌ ఈవీ, నెక్సాన్‌ ఈవీ కార్లకు 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. సాధారణంగా బీఎన్‌సీఏపీ సూచించే ఇండియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ధ్రువీకరణ పొందిన మొదటి కంపెనీగా స్వదేశ కంపెనీ అయిన టాటా నిలిచింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రాష్ పరీక్షలను నిర్వహించి, భద్రతా లక్షణాలతో సాంకేతికత అంశాలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతా పనితీరును సూచించడానికి సాధారణ స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌ కీలక విషయాలను ఓ సారి తెలుసుకుందాం. 

అత్యుత్తమ ఫలితాలతో బీఎన్‌సీఏపీ ప్రోటోకాల్‌కు నాయకత్వం వహించిన మొదటి తయారీదారుగా నిలిచినందుకు గర్వంగా ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రయాణికుల భద్రతకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నామో? ఈటెస్ట్‌ రిజల్ట్స్‌ బట్టి చూడవచ్చని వివరించారు. అలాగే టాటా హారియర్‌తో పాటు సఫారి స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు కూడా గత ఏడాది డిసెంబర్‌లో బీఎన్‌సీఏపీ నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన భారతదేశంలో మొదటి కార్లుగా అవతరించాయి.అయితే పంచ్‌ ఇప్పటి వరకు ఏ వాహనంలో నమోదు చేయని అత్యధిక స్కోర్ పాయింట్‌ను సాధించింది. పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 32కి 31.46, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49కి 45 స్కోర్ చేసిందని కంపెనీ పేర్కొంది. నెక్సాన్‌ ఈవీ కూడా ఆకట్టుకునే విధంగా స్కోర్ చేసింది ఏఓపీకు 32కి 29.86, సీఓపీ COPకి 49కి 44.95కు సాధించింది. 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పంచ్‌ ఈవీ, నెక్సాన్‌ ఈవీ 5 స్టార్ బీఎన్‌సీఏపీ రేటింగ్‌ను సాధించినందుకు అభినందనలు తెలిపారు. భారతదేశంలో భవిష్యత్‌ వాహనాలుగా ప్రాచుర్యం పొందుతున్న ఈవీలు భద్రతకు హామీనిస్తూ రేటింగ్‌తో రూపొందించడం హర్షణీయమని వివరించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ క్రాష్-టెస్టింగ్ కార్ల కోసం దేశీయ స్టార్-రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో వాహనాలు ఒకటి నుంచి ఐదు స్టార్‌ల మధ్య రేటింగ్‌ను పొందుతాయి. ముఖ్యంగా కారు ఢీకొన్నప్పుడు అందులోని ప్రయాణికుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో? వాటికి అనుగుణంగా రేటింగ్‌ను ఇస్తాయి. ఈ స్వచ్ఛంద రేటింగ్ విధానం అక్టోబర్ 1, 2023న అమలు చేయస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి