అర్ధరాత్రి కూంబింగ్‌లో 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. చీకట్లో పారిపోయిన స్మగ్లర్లు.!

|

Oct 05, 2020 | 8:04 AM

చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఆదివారం ఉదయం నుంచి చేపట్టిన కూంబింగ్ లో అర్థరాత్రి సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రాత్రి 2గంటల సమయంలో స్మగ్లర్ల ముఠా పోలీసులకు తారసపడింది. వారిని పోలీసులు పట్టుకొనే యత్నం చేయగా, స్మగ్లర్లు 27 దుంగలు పడవేసి పారిపోయారు. సమాచారం అందుకున్న డిఎస్పీ వెంకటయ్య స్పాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అడవుల్లోకి స్మగ్లర్లు వచ్చినట్లు తమకు సమాచారం అందిందని, దీంతో కూంబింగ్ […]

అర్ధరాత్రి కూంబింగ్‌లో 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. చీకట్లో పారిపోయిన స్మగ్లర్లు.!
Follow us on

చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఆదివారం ఉదయం నుంచి చేపట్టిన కూంబింగ్ లో అర్థరాత్రి సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రాత్రి 2గంటల సమయంలో స్మగ్లర్ల ముఠా పోలీసులకు తారసపడింది. వారిని పోలీసులు పట్టుకొనే యత్నం చేయగా, స్మగ్లర్లు 27 దుంగలు పడవేసి పారిపోయారు. సమాచారం అందుకున్న డిఎస్పీ వెంకటయ్య స్పాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అడవుల్లోకి స్మగ్లర్లు వచ్చినట్లు తమకు సమాచారం అందిందని, దీంతో కూంబింగ్ చేపట్టామని అన్నారు. లభించిన ఎర్రచందనం ఒక టన్ను బరువు ఉంటుందని, దీని విలువ 40 లక్షల రూపాయల కు పైగా ఉంటుందని తెలిపారు. సంఘటన స్థలానికి ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, సిఐ సుబ్రహ్మణ్యం చేరుకున్నారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొంత మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు పారిపోయిన స్మగ్లర్లు కోసం గాలిస్తున్నారు.