కుల మతాలకు అతీతంగా చరిత్ర సృష్టించిన తమిళనాడు మహిళ

| Edited By: Pardhasaradhi Peri

Nov 20, 2019 | 8:11 PM

భారతదేశంలో కులం, మతం అనే రెండు అంశాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటి వల్ల ఇండియాలో ఎన్నో కొట్లాటలు కూడా జరిగాయి. పుట్టుకతో మన కులం, మతం నిర్ణయించబడుతుందని ప్రభుత్వ వ్యవస్థ చెబుతోంది. అలాంటి ఈ కులమతాలతో ఏం సాధించగలమని ఆమె అనుకుంది.? ఇలా అనుకుందో లేదో.. కులం, మతం లేని జీవితం జీవించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ప్రయత్నంగా అడుగులు వేసింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేయగా.. చివరికి తనకు కులం, మతం లేదంటూ భారతదేశంలోనే […]

కుల మతాలకు అతీతంగా చరిత్ర సృష్టించిన తమిళనాడు మహిళ
Follow us on

భారతదేశంలో కులం, మతం అనే రెండు అంశాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటి వల్ల ఇండియాలో ఎన్నో కొట్లాటలు కూడా జరిగాయి. పుట్టుకతో మన కులం, మతం నిర్ణయించబడుతుందని ప్రభుత్వ వ్యవస్థ చెబుతోంది. అలాంటి ఈ కులమతాలతో ఏం సాధించగలమని ఆమె అనుకుంది.? ఇలా అనుకుందో లేదో.. కులం, మతం లేని జీవితం జీవించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ప్రయత్నంగా అడుగులు వేసింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేయగా.. చివరికి తనకు కులం, మతం లేదంటూ భారతదేశంలోనే ధ్రువీకరణ పత్రం పొందిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు.. తమిళనాడులోని వెల్లూరు జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన స్నేహ పార్తీబారాజా. అసలు ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వతహాగా లాయర్ అయిన స్నేహకు.. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మానాన్నలు కులం, మతం అనేది తెలియకుండా పెంచారు. స్కూల్లో, కాలేజీల్లో సైతం కులం పేరు నమోదు చేయలేదు. దీంతో కుల, మతాలకు అతీతంగా ఆమె పెరిగింది. ఇక ఇదే సమయంలో కులం, మతం లేకుండా సర్టిఫికెట్ ఉంటే బాగుంటుందని స్నేహాకు అనిపించింది. ప్రభుత్వమే అలాంటి సర్టిఫికెట్‌ను ఇస్తే కుల నిర్మూలనకు మంచి ఆరంభం అవుతుందనుకుంది. కానీ ఆ సర్టిఫికెట్ పొందటం అంత సులువు కాదు.. దానికోసం ఆమె ఏకంగా తొమ్మిదేళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది.

మొదట్లో స్నేహాకు అధికారులు కులం లేదంటూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయినా కూడా ఆమె పట్టు విడవలేదు. కలెక్టర్ వరకు వెళ్ళింది. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ మాదిరిగానే కులం, మతం లేదని సర్టిఫికెట్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు విషయాలన్నింటిని పరిశీలించారు. అప్పటి సబ్ కలెక్టర్.. తహసీల్దార్‌కు రికమండ్ చేయగా ఫిబ్రవరి 5, 2019న కులం, మతం లేదంటూ సర్టిఫికెట్‌ను స్నేహాకు అందజేశారు. దీంతో కులం, మతం లేదన్న సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.