పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 8:01 PM

ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో… పీజీ మెడికల్‌ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీల‌కు ఒకే త‌ర‌హా ఫీజుల విధానం ఉండగా తాజాగా.. కాలేజీల‌ వారీగా ఫీజులను ఫైన‌ల్ చేసింది. రాష్ట్ర‌ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఈ డెషిస‌న్ తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కన్వీనర్‌ కోటా విభాగం-ఏలో గతంలో రూ.3.80 లక్షల స్టార్టింగ్ ఫీజు ఉండగా ఇప్పుడు దానిని గరిష్ఠంగా రూ. […]

పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన ప్రభుత్వం
Follow us on

ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో… పీజీ మెడికల్‌ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీల‌కు ఒకే త‌ర‌హా ఫీజుల విధానం ఉండగా తాజాగా.. కాలేజీల‌ వారీగా ఫీజులను ఫైన‌ల్ చేసింది. రాష్ట్ర‌ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఈ డెషిస‌న్ తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కన్వీనర్‌ కోటా విభాగం-ఏలో గతంలో రూ.3.80 లక్షల స్టార్టింగ్ ఫీజు ఉండగా ఇప్పుడు దానిని గరిష్ఠంగా రూ. 7.75 లక్షలగా మార్చింది. కొన్ని కాలేజీల్లో రూ. 7 లక్షల నుంచి రూ. 7.50 లక్షల వరకు ఉన్నాయి. బీ- విభాగంలో గతంలో రూ. 24 లక్షలు ఉండగా… ఈసారి రూ. 23 లక్షల నుంచి రూ. 24 లక్షలుగా ఫైన‌ల్ చేశారు. సీ-కేటగిరీ రుసుములు బీ-కేటగిరీకి గరిష్ఠంగా మూడింతల వరకు ఉంటాయని ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేశారు.

నేటి నుంచే వెబ్‌ ఆప్షన్లు:

తెలంగాణ‌లోని గ‌వ‌ర్న‌మెంట్, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలోని పీజీ వైద్యవిద్య ఫ‌స్ట్ ఫేజ్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 4న ఎంట్ర‌స్ట్ నోటిస్ రిలీజ్ చేసింది. క్యాండిడేట్స్ మే 5న ఉదయం 8 నుంచి 7న మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలంది. ఇప్పటికే స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ ప్రక్రియ పూర్తికాగా, నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిలో ఫైన‌ల్ క్యాండిడేట్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. క్యాండిడేట్స్ కళాశాల, కోర్సుల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వెల్ల‌డించింది.