బెజవాడలో స్విగ్గీ బంద్.. ఎందుకంటే..?

|

Nov 08, 2019 | 8:29 PM

దేశమంతా విస్తరించిన ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ బుకింగ్ యాప్ స్విగ్గీ సర్వీసులు.. బెజవాడలో బంద్ కానున్నాయి. సిటీలో ఉన్న సుమారు 240కు పైగా హోటల్ యజమానులు ఈనెల 11 నుంచి స్విగ్గీ‌ని బ్యాన్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో విజయవాడ ప్రజలకు స్విగ్గీ సర్వీసులను పొందలేని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు గట్టి కారణమే చెబుతున్నారు హోటల్ యజమానులు. విజయవాడలో స్విగ్గీ బిజినెస్ ప్రారంభించినప్పుడు జీరో కమిషన్‌తో మొదలుపెట్టారని.. ఆ తర్వాత 5%, […]

బెజవాడలో స్విగ్గీ బంద్.. ఎందుకంటే..?
Follow us on

దేశమంతా విస్తరించిన ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ బుకింగ్ యాప్ స్విగ్గీ సర్వీసులు.. బెజవాడలో బంద్ కానున్నాయి. సిటీలో ఉన్న సుమారు 240కు పైగా హోటల్ యజమానులు ఈనెల 11 నుంచి స్విగ్గీ‌ని బ్యాన్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో విజయవాడ ప్రజలకు స్విగ్గీ సర్వీసులను పొందలేని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

ఇందుకు గట్టి కారణమే చెబుతున్నారు హోటల్ యజమానులు. విజయవాడలో స్విగ్గీ బిజినెస్ ప్రారంభించినప్పుడు జీరో కమిషన్‌తో మొదలుపెట్టారని.. ఆ తర్వాత 5%, 10%… ఇలా పెంచుకుంటూ ఇప్పుడు ఏకంగా 25 శాతం కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. అంతేకాకుండా ఏ రోజు డెలివరీ చేసిన ఆర్డర్ల మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా వారం, రెండు వారాల తర్వాత చెల్లించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. భారీ ఎత్తున కమిషన్ చార్జీలు మాత్రమే కాకుండా.. వినియోగదారుల దగ్గర నుంచి కూడా అదనంగా వసూలు చేస్తుండటంతో విజయవాడ హోటల్ యజమానులంతా సమావేశమయ్యి.. స్విగ్గీకి గట్టి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ పరిస్థితిని స్విగ్గీ ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి.