కేరళ గోల్డ్ కేసు: రెండోసారి ఎన్ఐఏ ముందుకు శివశంకర్

|

Jul 27, 2020 | 2:29 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఇవాళ మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ను ఎన్ఐఏ విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆయన ఎన్ఐఏ ముందు హాజరుకావడం ఇది రెండోసారి.మ

కేరళ గోల్డ్ కేసు: రెండోసారి ఎన్ఐఏ ముందుకు శివశంకర్
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఇవాళ మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ను ఎన్ఐఏ విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆయన ఎన్ఐఏ ముందు హాజరుకావడం ఇది రెండోసారి. ఈ నెల 23న దాదాపు ఐదుగంటల పాటు ఆయనను ప్రశ్నించిన ఎన్ఐఏ… ఇవాళ మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించింది. దీంతో ఆయన సోమవారం మరోసారి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ తో కేరళ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఆయనను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించింది. కాగా ఇదే కేసులో విచారణ జరుపుతున్న కస్టమ్స్ అధికారులు ఈ నెల 15న శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది.