చిన్నమ్మ మృతి.. ప్రముఖుల సంతాపం!

తెలంగాణ చిన్నమ్మ, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించిన ఆమె.. కేంద్రమంత్రిగానూ, ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పని చేశారు. 1998 అక్టోబర్‌ 13 నుంచి డిసెంబర్ 3వరకు ఢిల్లీ సీఎంగా పని చేశారు. అంతేకాకుండా ఢిల్లీకి తొలి మహిళా సీఎం కూడా సుష్మాస్వారాజే కావడం విశేషం. ఆ తర్వాత 2009 నుంచి […]

చిన్నమ్మ మృతి.. ప్రముఖుల సంతాపం!

Updated on: Aug 07, 2019 | 2:02 PM

తెలంగాణ చిన్నమ్మ, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించిన ఆమె.. కేంద్రమంత్రిగానూ, ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పని చేశారు. 1998 అక్టోబర్‌ 13 నుంచి డిసెంబర్ 3వరకు ఢిల్లీ సీఎంగా పని చేశారు. అంతేకాకుండా ఢిల్లీకి తొలి మహిళా సీఎం కూడా సుష్మాస్వారాజే కావడం విశేషం. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఇక మోదీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా సుష్మాస్వరాజ్ బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ మృతిపట్ల ప‌ట్ల పలువురు సినీ, రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. భారతదేశం మరో గొప్ప నేతను కోల్పోయిందంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us