అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ కొట్టివేత.. నిర్భయ దోషులకు ఉరే సరి!

|

Dec 18, 2019 | 2:34 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అతని రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ.. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్‌ను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. మానవత్వం మంట గలిపే రీతిలో నలుగురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారని.. […]

అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ కొట్టివేత.. నిర్భయ దోషులకు ఉరే సరి!
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అతని రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ.. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్‌ను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. మానవత్వం మంట గలిపే రీతిలో నలుగురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారని.. వారు క్షమించడానికి అర్హులు కారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టులో స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్. భానుమతి, అశోక్ భూషణ్, బొపన్నలతో కూడిన బెంచ్ విచారించింది. కాగా ఈ విచారణకు నిర్భయ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అంతేకాక సుప్రీం కోర్టు ఇచ్చిన  తీర్పుపై హర్షం వ్యక్తం చేయడమే కాకుండా నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కాగా, తాము కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని నిందితుడి తరపు లాయర్ పేర్కొన్నారు.

2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ళ పారామెడికల్ విద్యార్థినిపై ఢిల్లీలో ఆరుగురు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ శిక్ష పడింది. తర్వాత జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్థుడు విడుదలయ్యాడు. ఇక మరో దోషి రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మిగిలిన నేరస్థులకు ఉరి శిక్ష విధిస్తు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. కాగా, ఈ నలుగురు మృగాళ్లకు నెల రోజుల్లో ఉరి శిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.  అంతేకాకుండా రేపిస్టులు భయపడేలా ఉరి శిక్షను అమలు చేస్తున్నప్పుడు టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయాలనీ కోరారు.