Breaking :ఎల్‌జీ పాలిమర్స్‌ కేసు విచారణ జూన్​ 8కి వాయిదా

|

May 19, 2020 | 2:12 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటికే ఘటన పై 7 విచారణ కమిటీలు వేశారని, మే 7న ఘటన జరిగితే 8 వ తేదీనే విచారణ కమిటీలు వేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు అత్యున్న‌త‌ న్యాయస్థానానికి వివ‌రించారు. […]

Breaking :ఎల్‌జీ పాలిమర్స్‌ కేసు విచారణ జూన్​ 8కి వాయిదా
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటికే ఘటన పై 7 విచారణ కమిటీలు వేశారని, మే 7న ఘటన జరిగితే 8 వ తేదీనే విచారణ కమిటీలు వేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు అత్యున్న‌త‌ న్యాయస్థానానికి వివ‌రించారు.

ఘటనపై విచారణ జరిపేందుకు నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ కి అధికారం లేదని వాదనలు వినిపించగా…అవన్నీ అక్కడే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణాధికారంపై హరిత ట్రిబ్యునల్​లో లేవనెత్తే ఛాన్స్ ఇచ్చింది. జూన్ 1న హరిత ట్రైబ్యునల్​లో విచారణ తరువాత మరోసారి వాదనలు వింటామని ధ‌ర్మాస‌నం తెలిపింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.