ఉగ్రదాడి నేపథ్య౦లో భారత్ ప్రతిపాదనకు పలుదేశాల మద్దతు

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:15 PM

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦ దౌత్యపర౦గా పాకిస్తాన్ ను దెబ్బతీయడానికి భారత్ సన్నాహాలు చేస్తు౦ది. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే భారత ప్రతిపాదనకు రష్యా మద్దతు పలికింది. పుల్వామా ఉగ్రదాడిని ఆ దేశ మంత్రి డేనిస్‌ మంతురోవ్‌ బుధవారం ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ వెన్నంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రతిపాదనను త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల […]

ఉగ్రదాడి నేపథ్య౦లో భారత్ ప్రతిపాదనకు పలుదేశాల మద్దతు
Follow us on

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦ దౌత్యపర౦గా పాకిస్తాన్ ను దెబ్బతీయడానికి భారత్ సన్నాహాలు చేస్తు౦ది.
జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే భారత ప్రతిపాదనకు రష్యా మద్దతు పలికింది. పుల్వామా ఉగ్రదాడిని ఆ దేశ మంత్రి డేనిస్‌ మంతురోవ్‌ బుధవారం ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ వెన్నంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రతిపాదనను త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ఫ్రాన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఇప్పటికే భారత్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. తాజాగా రష్యా కూడా భారత్‌ వాదనకు మద్దతు పలకడంతో పాక్‌పై దౌత్యపరమైన ఒత్తిడి మరింత పెరిగినట్లయింది.