Sundar Pichai : అమెరికాను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గూగుల్.. అందరికీ కరోనా టీకా సమంగా పంపిణీ జరిగేలా ప్లాన్..

|

Jan 26, 2021 | 9:12 PM

కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న అమెరికాను ఆదుకునేలా  ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. దేశంలో విద్య ప్రచారానికి, అందరికీ కరోనా టీకా సమంగా...

Sundar Pichai : అమెరికాను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గూగుల్.. అందరికీ కరోనా టీకా సమంగా పంపిణీ జరిగేలా ప్లాన్..
Follow us on

Sundar Pichai : కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న అమెరికాను ఆదుకునేలా  ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. దేశంలో విద్య ప్రచారానికి, అందరికీ కరోనా టీకా సమంగా పంపిణీ జరిగేలా 150 మిలియన్ డాలర్లు ప్రకటించింది. వీటిలో 100 మిలియన్ డాలర్లు సీడీసీ ఫౌండేషన్‌, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు.

కరోనా వైరస్‌తో అతలాకుతలమైన అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టీకాల విషయంలో వర్ణ వివక్షతకు గురవుతున్నట్లు తెలిసిందని..  ప్రధానంగా రూరల్ కమ్యూనిటీస్‌లో ఒకే ధరకు వ్యాక్సిన్ అందడం లేదని ఆరోపించారు. టీకాల పంపిణీపై యూఎస్‌లో ఇటీవల వెలువడిన నివేదికలే దీనికి నిదర్శనం అన్నారు.

అందుకే లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కిర్క్‌లాండ్, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాలలోని తమ భవనాలు, పార్కింగ్ లాట్స్, ఓపెన్ స్పేసేస్‌లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా ప్రజలకు విరివిగా టీకాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలియజేశారు.

చాలా తక్కువ సమయంలోనే వీటిని దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తామన్నారు. అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా టీకా పంపిణీ కేంద్రాల సమాచారాన్ని ప్రజలు చాలా సులువుగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పిచాయ్ తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

అది భక్తీ కాదు పాడూ కాదు… పిచ్చి..! అవును నిజంగానే పిచ్చే అంటున్న మానసిక వైద్యులు

భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం ఖారారు.. తేదీలను ఫిక్స్ చేసిన వైదిక కమిటీ

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!