ఆంధ్రా ప్యారిస్‌లో పోలీస్ ఓవరాక్షన్.. ప్రైవేటు చేతుల్లో లాఠీ, వాకీటాకీ

కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు పీరియడ్‌లో పోలీసులు ఓ పక్క ప్రాణాలకు తెగించి విధి నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే.. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన గుంటూరు జిల్లా తెనాలిలో ఓ పోలీస్ ఓవరాక్షన్ చేశాడు.

ఆంధ్రా ప్యారిస్‌లో పోలీస్ ఓవరాక్షన్.. ప్రైవేటు చేతుల్లో లాఠీ, వాకీటాకీ
Follow us

|

Updated on: Apr 18, 2020 | 3:38 PM

కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు పీరియడ్‌లో పోలీసులు ఓ పక్క ప్రాణాలకు తెగించి విధి నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే.. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన గుంటూరు జిల్లా తెనాలిలో ఓ పోలీస్ ఓవరాక్షన్ చేశాడు. ఎస్సై మధు చేసిన ఓవరాక్షన్‌పై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన ప్రజలు, మీడియా ప్రతినిధులను డీజీపీకి చెప్పినా తనకేమీ కాదని సవాల్ చేశాడు సదరు ఎస్సై. ఎస్సై ఓవరాక్షన్ ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

తెనాలిలో ఎస్ఐ మధు పవన్ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను విధి నిర్వహణకు ఉపయోగించాల్సిన లాఠీని, పోలీసు వాకీటాకీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, తాను చోద్యం చూశాడు. ప్రైవేటు వ్యక్తులకు పోలీసు విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించాడు. ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలను సైతం ప్రైవేట్ వ్యక్తులు నిలిపివేస్తూ యధేచ్ఛగా ప్రవర్తిస్తుంటే తాను ఓ ప్రేక్షకునిగా మారిపోయాడు. విలేకరులు ఐడీ కార్డులు చూపించినా సదరు ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యం చేస్తుంటే ఎస్సై వారికి అండగా నిలిచాడు.

మీడియా ప్రతినిధుల ఐడీ కార్డులు విసిరికొట్టి బండ బూతులు తిట్టడం ప్రారంభించాడు ఎస్ఐ. డీఎస్పీ ప్రోగ్రామ్‌కు వెళ్తున్నామని మీడియా ప్రతినిధులు చెబుతున్నా వినకుండా దురుసుగా ప్రవర్తించాడు. అక్రిడేషన్ కార్డు రోడ్డు మీద విసిరి పడేసాడు. ఎస్పీకీ కాకపోతే …డీజీపికి చెప్పుకోవాలని సవాల్ చేశాడు. ఎస్సై ప్రవర్తనను కొందరు ప్రజలు, మీడియా ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు విచారణకు ఆదేశించారు.