జామియా ఘటన.. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల నిరసన!

| Edited By:

Dec 18, 2019 | 3:32 PM

యూకేలోని  ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం మంగళవారం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వర్సిటీ ప్రాంగణంలో నిరసన ప్రదర్శనకు దిగారు. ఢిల్లీలోని జామియా మిలియా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఆదివారం జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా జరిపిన పోలీసుల చర్యలను ఖండిస్తూ వారు ఈ ప్రదర్శన చేశారు. గత వారం పార్లమెంటులో జారీ అయిన పౌరసత్వ (సవరణ) చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామియా విద్యార్థులు చేసిన నిరసనలో భారీ […]

జామియా ఘటన.. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల నిరసన!
Follow us on

యూకేలోని  ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం మంగళవారం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వర్సిటీ ప్రాంగణంలో నిరసన ప్రదర్శనకు దిగారు. ఢిల్లీలోని జామియా మిలియా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఆదివారం జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా జరిపిన పోలీసుల చర్యలను ఖండిస్తూ వారు ఈ ప్రదర్శన చేశారు. గత వారం పార్లమెంటులో జారీ అయిన పౌరసత్వ (సవరణ) చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామియా విద్యార్థులు చేసిన నిరసనలో భారీ హింసాకాండ చెలరేగింది. పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నిరసనలు దేశమంతటా మిన్నంటాయి. కోల్‌కతా, బనారస్‌తో సహా పలు నగరాల్లో విద్యార్థులు అర్ధరాత్రి వరకు నిరసనలు నిర్వహించారు.

ఈ నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. “విశ్వవిద్యాలయాల్లో, ఇతర చోట్ల నిరసన తెలిపే వారి ప్రాథమిక హక్కును కాలరాయడానికి పోలీసు బలగాల్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య సమాజ పునాదులపై ప్రత్యక్ష దాడిచేసినట్లే” అని ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పౌరసత్వ చట్టం.. “భారత పౌరసత్వం పొందే ప్రక్రియలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశిస్తుంది, అయితే ముస్లింలను దాని పరిధి నుండి స్పష్టంగా మినహాయించారు” అని పేర్కొంది.

యుఎస్ లోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి 400 మందికి పైగా విద్యార్థులు జామియా, అలీఘర్ యూనివర్సిటీ నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో హార్వర్డ్, యేల్, కొలంబియా, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయాల స్కాలర్లు “భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనగా.. జామియా, అలీఘర్ యూనివర్సిటీ లలో విద్యార్థులపై జరిగిన క్రూరమైన పోలీసు హింసను ఖండిస్తున్నట్లు తెలిపారు”.

కొలంబియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పోలీసు చర్యను ఖండించారు. “వివక్షత కలిగిన అన్యాయమైన చట్టాన్ని నిరసిస్తూ మా సహోద్యోగులపై జరిపిన పొలిసు చర్యలపై మేము మౌనంగా ఉండదల్చుకోలేదు” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం వేగవంతం చేయడానికి ఉద్దేశించినది. అయితే, ఈ చట్టం దేశం యొక్క లౌకికవాద ప్రాథమిక సూత్రాన్ని ప్రభావితం చేస్తుందని ప్రతిపక్ష నాయకులు మరియు నిరసనకారులు పేర్కొన్నారు.

సోమవారం, ప్రధాని నరేంద్ర మోదీ.. పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని, ప్రజలందరూ శాంతి వహించాలని విజ్ఞప్తి చేశారు.