అనంతపురం జిల్లా ప్ర‌జ‌ల‌కు అలెర్ట్..రేప‌ట్నుంచి కఠిన లాక్ డౌన్..!

|

Jun 20, 2020 | 3:26 PM

అనంతపురం జిల్లాలో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో అధికారులు అల‌ర్ట‌య్యారు. రేపటి నుంచి కఠిన నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేయనున్నారు.

అనంతపురం జిల్లా ప్ర‌జ‌ల‌కు అలెర్ట్..రేప‌ట్నుంచి కఠిన లాక్ డౌన్..!
Follow us on

అనంతపురం జిల్లాలో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో అధికారులు అల‌ర్ట‌య్యారు. రేపటి నుంచి కఠిన నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఈ విష‌యాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే డిజాస్టర్ చట్టం కింద క్రిమినల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ముందుగా  అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించ‌నున్నారు.

కాగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయ‌ని.. టి కేఫ్ లు పూర్తి బంద్ అవ్వ‌నున్నట్లు వివ‌రించారు. హోటల్స్ లో ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్ సర్వీస్ అందించ‌నున్నారు. ఇక మాంసం దుకాణాలు ఆదివారం పూర్తిస్థాయిలో బంద్ అవ్వ‌నున్నాయి. వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్ డౌన్ పొడిగించ‌డం లేదా ఆపివేయ‌డంపై నిర్ణ‌యం  తీసుకోనున్నారు అధికారులు.