Strain virus: భ‌య ‌పెట్టిస్తున్న స్ట్రైయిన్ వైర‌స్.. లండ‌న్ నుంచి ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు 15 మంది

|

Dec 26, 2020 | 1:06 PM

ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారితో ఇబ్బందులు ప‌డుతూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న త‌రుణంలో మ‌రో కొత్త క‌రోనా వైర‌స్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోక ...

Strain virus: భ‌య ‌పెట్టిస్తున్న స్ట్రైయిన్ వైర‌స్.. లండ‌న్ నుంచి ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు 15 మంది
Follow us on

ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారితో ఇబ్బందులు ప‌డుతూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న త‌రుణంలో మ‌రో కొత్త క‌రోనా వైర‌స్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోక ముందే మ‌రో స్ట్రైయిన్ వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. బ్రిట‌న్ నుంచి మొద‌లైన ఈ స్ట్రైయిన్ వైర‌స్ దేశంలోకి వ్యాప్తించింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సైతం అడుగు పెట్టింది. తాజాగా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా ప‌రిధిలో 15 మంది ప్ర‌యాణికులు లండ‌న్ నుంచి వ‌చ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. న‌ల్గొండ జిల్లాలో 9 మంది, సూర్యాపేట జిల్లాలో ఐదుగురు, యాదాద్రి-భువ‌న‌గిరి జిల్లాల నుంచి ఒక‌రు వ‌చ్చిన‌ట్లు వైద్య శాఖ గుర్తించింది. వీరిలో ఒక‌రు నిజామాబాద్ వెళ్ల‌గా, మ‌రొక‌రు విజ‌య‌వాడ వెళ్లిపోయారు. మిగిలిన ఏడుగురు ప్ర‌యాణికులు న‌ల్గొండ జిల్లా కేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయ‌గా, కేత‌ప‌ల్లికి చెందిన ఓ ప్ర‌యాణికుడికి పాజిటివ్ తేలింది. అయితే కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ కోసం శాంపిళ్ల‌ను పూణేలోని సీసీఎంబీ ల్యాబ్ కు పంపించామ‌ని డీఎంహెచ్ ఓ కొండ‌ల్‌రావు తెలిపారు.

కాగా, ఈ స్ట్రైయిన్ వైర‌స్ తీవ్రంగా వ్యాప్తిస్తుంద‌ని తెలియ‌డంతో భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే లండ‌న్ నుంచి భార‌త్‌లోకి చాలా మంది ప్ర‌యాణికులు వ‌చ్చారు. వారంద‌రిని కూడా ట్రెస్ చేసేందుకు అధికారులు ఉరుకులు ప‌రుగులు పెడుతున్నారు.

కాగా, ఈ కొత్త క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారికి వైద్యం అందించేందుకు ప్ర‌భుత్వాలు జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక గ‌దుల‌ను ఏర్పాటు చేశారు. వీరి కోసం ప్ర‌త్యేక ఐసీయూ సిద్ధం చేశారు. ప్ర‌స్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్న వారితో కాకుండా విడిగా ఉంచుతున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

https://tv9telugu.com/strain-virus-in-telangana-corona-tests-to-1200-international-passengers-374361.htmlతెలంగాణకు ‘స్ట్రెయిన్’ వైరస్ గుబులు.. బ్రిటన్ నుంచి వచ్చిన 1200 మందికి కరోనా పరీక్షలు.!